బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ…
Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని మరో ఏడాది పొడగించారు. అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అతడిని జాతీయ భద్రతా చట్టం కింద మరో ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు.
JKGF Banned In India: భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్న ఉగ్రసంస్థలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్)పై శుక్రవారం ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)ను కూడా నిషేధించింది. ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఈ నిషేధం విధించింది కేంద్రం. దీంతో…