Anti-Semitism: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్ధులు పాలస్తీనా-హమాస్‌కి మద్దతుగా బహిరంగంగా మద్దతు తెలపడంతో పాటు యూదు విద్యార్ధులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి కొందరు లిబరల్స్ అని చెప్పుకునే వర్సిటీ టాప్ అధికారులు మద్దతు తెలుపుతున్నారు. ఇలా పలు వర్సిటీల్లో యూదు వ్యతిరేకత పెరగడంతో యూఎస్ కాంగ్రెస్ విచారణ చేసింది.