Bengal Assembly: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శల రావడంతో.. అసెంబ్లీలో ఇవాళ (మంగళవారం) బెంగాల్ సర్కార్ హత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు ఆమోదం పొందింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత మమతా ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉంటే, వరసగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ని మమతా సర్కార్ ఈ రోజు బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు మరియు సవరణ) బిల్లు, 2024కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అత్యాచార దోషుల చర్యలు బాధితురాలి మరణానికి దారి తీస్తే మరణశిక్ష విధించేలా ఈ కొత్త బిల్లు రూపొందించబడింది.