Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.
మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు కీలక నేతలు హతమయ్యారు. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో నెత్తురోడుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని సూచించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం .
Amit Shah: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగబోయే భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.