జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారత ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తుంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని ఆలోచనలో కేంద్ర హోం శాఖ ఉంది.
భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్, బ్రిటిష్- కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ యొక్క ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI)ని భారత ప్రభుత్వం రద్దు చేసింది.