Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు మతమార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. పవిత్ర బైబిల్ గ్రంథాన్ని పంచిపెట్టడం, మంచి బోధనలను అందించడం మతమార్పిడికి ఆకర్షితం చేయడం కాదని అలహాబాద్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అపరిచిత వ్యక్తి ఈ చట్టంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని హైకోర్ట్ పేర్కొంది.
Karnataka: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీజేపీ తీసుకువచ్చిన అన్ని చట్టాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకువచ్చని మతమార్పిడి నిరోధక చట్టాన్ని గురువారం కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.