Bichagadu 2 : విజయ్ ఆంటోని ఆరేళ్ల క్రితం నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో గుర్తుందా? 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అందుకుంది.
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం.…