అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లి, ముందుకు రావడంతో కలకలం రేపుతుంది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు లోపలికి వెళ్లడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన అంతర్వేది సర్పంచ్ కొండా జాన్ బాబు ఇది సునామీకి సంకేతం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో అంతర్వేది బీచ్‌లో పేరుకుపోయిన ఒండ్రు మట్టి బయటపడడంతో పర్యాటకులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. Also Read: Asia Cup…
Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది.
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్. హిందూ దేవతలను రాష్ట్రంలో అవమానిస్తున్నారు. అంతర్వేది రథదహనంతో ప్రారంభమై అనేక సంఘటనలు హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా? పెదకాకాని ఆలయంలో ముస్లిం వ్యక్తి మాంసం వండటం హైందవ మతాన్ని అవమానించడమే. ఇంత దారుణం జరుగుతుంటే.. పోలీసులు , అధికారులు చోద్యం చూస్తున్నారు. జిన్నా టవర్ పేరు చెప్పగానే…
సముద్రం ఎంతో సంపదకు ఆలవాలం. ఎన్నోరకాల చేపలు వలకు చిక్కుతుంటాయి. అప్పుడు తిమింగలాలు కూడా పడతాయి. కానీ అరుదైన చేపలు మాత్రం అరుదుగా మత్స్యకారులకు దొరుకుతాయి. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు మంచి చేపలు దొరికితే ఆనందంతో గంతులేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారుల పంట పండింది. అంతర్వేదిలో మినీ హార్బర్లో ఉప్పాడ మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారు వేసిన వలకు చిక్కింది మామూలు ఆషామాషీ చేప కాదండోయ్. సుమారు…
అంతర్వేదిలో మత్స్యకారులకు అప్పుడప్పుడూ పంట పండుతుంటుంది. సాగరమాత వారికి ఇలా వరాలు ఇస్తూ వుంటుంది. వారి వలలో పడే చేపలు వారికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. వారి కుటుంబానికి ఆధరువు అవుతాయి. తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ట గోదావరి నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.…
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రం 15 మీటర్ల మేర ముందుకు వచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో పాటుగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో బీచ్ లో ఉన్నా దుకాణాలు నేలమట్టం అయ్యాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారినట్టు వాతావారణశాఖ పేర్కొన్నది. మత్స్యకారులు చేపల…