ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెట్టాలని…