ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏటా 120 కోట్ల ఆదాయం వచ్చే ఈ పుణ్య క్షేత్రంలో 238 మంది పని చేస్తున్నారు. ఆలయంలో ఐదేళ్లు పైబడి ఒకేచోట తిష్ఠవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఆ జాబితాలో 80 మందిని గుర్తించారట. నెలాఖరులోగా ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఏళ్ల తరబడి అన్నవరం ఆలయంలోనే పాతుకుపోయిన వారిలో గుబులు రేగుతోందట. బదిలీ…