తిరుమలలో త్వరలోనే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల అనుమతి ఎప్పుడనేది ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామని తెలిపారు. తిరుమలలో సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరికీ ఒకే రకమైన అన్నప్రసాదం అందిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా తొలగిస్తామన్నారు. హోటళ్లు లేకుండా భక్తులకు ఉచితంగా భోజనం అందించేలా చర్యలు చేపడతామన్నారు.…