జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన…
సుప్రీంకోర్ట్ లో జ్ఞానవాపీ విచారణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా జ్ఞానవాపీ మసీదు వ్యవహారం మారింది. రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో సుప్రీం కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని వారణాసిజిల్లా కోర్ట్ లోనే విచారించాలనే నిర్ణయంపై మొగ్గు చూపింది. జిల్లా జడ్జీ ఈ విచారణను చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. సీనియర్, అనుభవం ఉన్న జడ్జీ ఈ కేసును విచారిస్తారని సుప్రీం కోర్ట్…