(మే 8న మదర్స్ డే సందర్భంగా…) తెలుగు చిత్రసీమలో తల్లి పాత్రల్లో అలరించిన వారెందరో ఉన్నారు. వారిలోనూ చిత్రవిచిత్రంగా సాగిన వైనమూ కనిపిస్తుంది. తమ కంటే వయసులో ఎంతో పెద్దవారయిన నటులకు అమ్మలుగా నటించి ఆకట్టుకున్నవారూ ఉన్నారు. ఒకప్పుడు కొందరు హీరోల సరసన నాయికలుగా నటించి, తరువాతి రోజుల్లో వారికే తల్లులుగా నటించి మెప్పించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తల్లిగా నటించిన వారితో తరువాత నాయకులుగా నటించిన వారూ లేకపోలేదు. ఇలా చిత్ర విచిత్రమైన సినిమా రంగంలో…
(జూలై 14తో యన్టీఆర్ ‘శాంత’కు 60 ఏళ్ళు)నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన ‘శాంత’ చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎమ్.ఆర్.జయరామ్ నిర్మించారు. ఇదే మానాపురం అప్పారావు దర్శకత్వంలో తరువాత మరో రెండేళ్ళకు యన్టీఆర్, అంజలీదేవి జంటగానే ‘పరువు-ప్రతిష్ఠ’ అనే చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాల కథ దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఈ…