‘ప్రతిదీ రాజకీయం చేయొద్దు’ అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మాట్లాడరా?, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమీషన్స్, కబ్జాల…