Murder : బాపట్ల జిల్లాలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు…గొంతు కోసి దారుణ హత్య చేశారు. ఈఘటన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలకలం రేపింది. ఒక్కసారిగా స్థానికులు ఉలికిపాటుకు గురయ్యారు. బాపట్ల జిల్లా సంతమాగులూరుకి చెందిన వీరాస్వామిరెడ్డి గత కొంత కాలంగా బెంగళూరులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరాస్వామిరెడ్డికి, సంతమాగులూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య…