పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి అని పేర్కొన్నారు. విధ్వంసకర పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలి.. ఎన్నికల సమయంలో పని చేసే విషయాలపై క్షేత్ర స్థాయిలో వివరించడంతో పాటు కార్యకర్తలతో కలిసి దిశా నిర్దేశం చేయాలన్నారు.
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం.. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారు.
ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. నైట్‌హాల్ట్ పాయింట్ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కలిశారు.
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది.
జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో జగన్మాత ఈశ్వరీ దేవి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు.