విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు.
Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు.
Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నేనే సెన్షన్.. ఆర్డర్ తెచ్చానని రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. నా తరువాత వచ్చిన మాజీ ఎంపి మార్గా భరత్ రామ్ శిలాఫలకం వేసి నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు.
MP Purandeswari: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Minister Lokesh: పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై మంత్రి సీరియస్ అయ్యారు.
YV Subba Reddy: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వాస్తవం కాదు..విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
CM Chandrababu: వివిధ శాఖలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సమీక్షించనున్నారు. అలాగే, ఆర్థిక శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.