Liquor Sales: మందుబాబల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. కల్తీ మద్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం ఖజానాకు గట్టిగానే షాకిస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు సగటున 78 నుంచి 80 కోట్లు వరకు ఎక్సైజ్ రెవిన్యూ వస్తుంది. అయితే.. కొన్ని రోజులుగా కల్తీ మద్యం భయంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో రెవిన్యూ డ్రాప్ తీవ్రంగా నమోదైనట్టు సమాచారం. మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోగా, నకిలీ బ్రాండ్ల భయంతో కొంతమంది వినియోగదారులు పూర్తిగా మద్యం కొనడం మానేశారు. దీంతో రోజువారీ రెవిన్యూ లోటుతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గట్టి దెబ్బ తగిలింది.
Read Also: Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..
కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం మూలాలు బయటపడుతుండటంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది. ల్యాబ్స్, గోడౌన్స్ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైన్ షాప్స్ పై ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తూ .. నకిలీ మద్యం లిక్కర్ నెట్‌వర్క్ గుర్తించేందుకు చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ.ప్రజలకు బ్రాండెడ్, నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైన్ షాప్స్, బార్స్ దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది.మందుబాబులు.. గ్లాస్ ఎత్తడానికి ముందు ఒకటి, రెండుసార్లు ఆలోచిస్తున్నారు. భయంతో మద్యం వినియోగం తగ్గిపోవడం.. అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా..చిన్న బార్స్, బెల్ట్ షాప్స్ దగ్గర సేల్స్ దారుణంగా తగ్గాయి.ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేల్స్ పడిపోవడంతో వైన్ షాప్స్ యజమానులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నకిలీ మద్యం ఎఫెక్ట్‌తో మద్యం మార్కెట్‌పైనా గట్టి ప్రభావమే చూపుతోంది. మందుబాబుల సర్కిల్స్‌లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని ఆలోచిస్తున్నారు లిక్కర్ ప్రియులు.
కాగా, కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్ధన్ చుట్టూ లోతైన విచారణ చేపట్టారు. జనార్ధన్ కు చెందిన ఏఎన్ఆర్ బార్ లైసెన్స్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు కూడా. మరోవైపు భవానీపురం శ్రీనివాస్ వైన్స్ లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే బార్ లైసెన్స్ దారుడిని విచారణ జరిపారు పోలీసులు. బార్ మేనేజర్ గా పనిచేసిన కళ్యాణ్ వారానికి 15 కేసులు చొప్పున అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. కళ్యాణ్ తో పాటు ఖాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. మిగిలిన నిందితుల కోసం అధికారులు విచారణ చేపట్టారు.