రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. సుమారు రెండుగంటలుపైగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు. పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లిలో వాగులు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురంధేశ్వరిని నియమించారు.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
హంద్రీనీవా దుస్థితికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం అన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజిని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హంద్రీనీవా దుస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు.. 5 శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొల్లగొట్టుకుందన్నారు..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్న ఆయన.. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని వెల్లడించారు..
వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని.. విజయవాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ..
శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం శాస్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు ప్రారంభించారు అర్చకులు.
ఈ రోజు, రేపు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు..