బంగాళాఖాతంలో తుఫాన్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. పలు ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తి చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ క్యాంపస్‌లు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను నెలకొల్పాలని కోరారు.
రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్ సీకే కన్వెన్షన్‌లో జరుగుతోందని ఏపీ ప్రభుత్వ సెక్రటరీ సురేష్ పేర్కొన్నారు. నాలుగు కేటగిరీలలో రిజిస్ట్రేషన్ ఆన్ లైన్లో చేశామన్నారు. డెలిగేట్స్, డ్రోన్, హ్యాకథాన్, స్పీకర్స్ కేటగరీల కింద రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. 6929 రిజిస్ట్రేషనులు వచ్చాయని.. రెండు రోజుల క్రింద రిజిస్ట్రేషన్లు ఆపేశామన్నారు.
ఏపీలో మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుకను అందించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు.
విజయవాడలోని గుర్లలో డయేరియా మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డయేరియా బాధితులు ఇంకా మరొకొన్ని గ్రామాలలో ఉన్నారని ఆయన తెలిపారు. 16 మంది డయేరియా బారిన పడి మృతి చెందారన్నారు.
రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న హౌసింగ్ పథకంలో డూప్లికేట్ లబ్ధిదారులు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి తాజాగా రూపొందించిన ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరులో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉపముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. డయేరియా వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు.