ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది.. మొత్తంగా ఈ ఏడాదిలో పీఆర్సీ ప్రకటన అనేది వట్టి మాటే అని తేలిపోయింది అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ మళ్లీ తిరోగమనం వైపు మళ్లిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్తాం అంటున్నారు.. పీఆర్సీపై కసరత్తులో భాగంగా.. ఇవాళ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఆర్ధిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.. సచివాలయ ఉద్యోగుల సంఘం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. ఒక్కటేంటి.. శ్రీవారి వైభోగం మాటలకు అందదు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. Read Also: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. టీటీడీ…
చీప్ లిక్కర్‌పై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి.. ఏపీలో తాము అధికారంలోకి వస్తే రూ.70 కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైదే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను అంతా ట్రోల్ చేస్తున్నారు.. అయితే.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? అని ప్రశ్నించిన ఆయన..…
వంగవీటి రాధాపై రెక్కీ వార్తలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం రేపాయి.. ఆ విషయాన్ని రాధాయే స్వయంగా బయటపెట్టడం.. ఆ తర్వాత ప్రభుత్వం 2+2 సెక్యూరిటీ కల్పించడం.. ఆయన తిరస్కరించడం జరిగిపోయాయి.. మరోవైపు.. రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే.. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప సీరియస్‌గా స్పందించారు.. రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కీ నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై…
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. ఇప్పటి వరకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పి. మధు కొనసాగగా.. ఇవాళ కొత్త కార్యదర్శిగా వి. శ్రీనివాసరావును ఎన్నుకున్నారు మహాసభలకు హాజరైన ప్రతినిధులు.. ఇకపై మధు స్థానంలో కార్యదర్శిగా శ్రీనివాసరావు కొనసాగనున్నారు.. ఇక, కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శి వర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది.. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా 13 మందిని ఎంపిక చేశారు.. రాష్ట్ర…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. ఏపీలో తాజాగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 16కు పెరిగింది.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 31,743 శాంపిల్స్ పరీక్షించగా.. 162 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో 186 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు..…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్‌పై తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, సోమువీర్రాజు వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… సోషల్ మీడియా వేదికగా లిక్కర్ అమ్మకాలపై స్పందించిన ఆమె.. చీప్ లిక్కర్‌తో బీజేపీ.. ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు… మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో ప్రసంగించిన ఆయన.. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక, కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అదే స్థాయిలో కమ్యూనిస్టులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.. సోము వీర్రాజును పిచ్చి కుక్క కరిచిందని వ్యాఖ్యానించారు పి. మధు.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. అసలు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. రాష్ట్రంలో ఒకేసారి 10 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో… ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు పెరిగింది.. అయితే బాధితులంతా ఆరోగ్యంగా ఉన్నారని.. ఐసోలేషన్‌లో ఉంచినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ఆరోగ్యశాఖ.. ఇక, కొత్తగా నమోదైన ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. అందులో 41 ఏళ్ల మహిళ ఈ నెల 21వ తేదీన కువైట్ నుంచి పశ్చిమ గోదావరికి…
ఏపీలో వైసీపీ సర్కారుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అన్నవాళ్లు సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు . మద్యం రేట్లు పెంచి సామాన్యులను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ బాగుంటే రూ.50కే చీప్ లిక్కర్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. Read Also: అమరావతిలోనే బీజేపీ ఆఫీస్.. స్పష్టం చేసిన సోము…