తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి మాసానాకి సంబంధించిన దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఎల్లుండి ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటా టికెట్లను ఉంచనున్నారు.. ఎల్లుండి ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్‌చేసుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి మాసంలో రోజుకి 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ.. రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా 12 వేలుగా ఉండగా.. అదే సర్వదర్శనం టికెట్లను రోజుకి 10 వేల చొప్పున విడుదల చేయనుంది టీటీడీ. కాగా, టీటీడీ విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Read Also: తెలంగాణ కోవిడ్ అప్‌డేట్.. తగ్గినా.. ఇంకా భారీగానే..