CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు విని, పరిష్కరించేందుకే తాను వచ్చానని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం…
Diarrhea in kolakaluru: డయేరియా కారణంగా గతంలో ఏపీ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కొలకలూరు గ్రామంలో మరోసారి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వ్యర్ధాలతో కూడిన నీటిని ఇంటింటికి సప్లై చేస్తున్న పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారుతోంది. డయేరియా రావడంతో వందల సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన హడావిడి అప్పుడే మర్చిపోయారు. కొలకలూరు గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించే పరిస్థితులు మాత్రం నెలకొనడం లేదు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో మళ్లీ డయేరియా…
Central Government answer on special package to andhra pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇటీవల పార్లమెంట్లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రత్యేక ప్యాకేజీపై కీలక ప్రకటన చేసింది. ఏపీకి 2016లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇప్పటివరకు 17 ప్రాజెక్టుకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి రూ.7,797 కోట్ల రుణం అందించామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్…
* అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన.. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్న సీఎం జగన్ * అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై ఈరోజు సాయంత్రం 4 గంటలకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక సమావేశం * గుంటూరు: నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన, బాదుడే…
బార్ల మద్యం పాలసీ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… అయితే, పిటిషనర్ల తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సంబంధిత జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.. ఇక, రేపటి నుంచి వేలం ప్రారంభమవుతుందని, నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డిపాజిట్ తిరిగి ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల నష్టపోతారని ధర్మాసనానికి వివరించారు. వాదనలు విన్న…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్‌బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు మోహన్‌బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా…
కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరద బాధితులను గడపగడపకు వెళ్లి పరామర్శిస్తున్నారు.. ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు.. ఏఒక్కరూ మాకు సాయం అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని…
వెంటనే ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకపోయినా.. నేతల పర్యటనలు, ప్రకటనలు చూస్తేంటే.. ఎన్నికలు వచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరోవైపు.. ఇక, జనసేన, బీజేపీ, వామపక్షాలు.. ఇలా ఎవరి వ్యూహాల్లో వారు మునిగిపోయారు.. అయితే, ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు టీడీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న… విశాఖపట్నంలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న…