Vidadala Rajini: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో విడదల రజిని భేటీ.. విలేజ్ క్లినిక్ కాన్సెఫ్ట్‌పై కేంద్రం ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటన ఉన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశం అయ్యారు.. ఏపీలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరినట్టు ఆమె వెల్లడించారు.. ఇక, కేంద్రమంత్రి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సచివాలయం, విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్ ను కేంద్ర మంత్రి ప్రశంసించారని మీడియాకు తెలియజేశారు మంత్రి విడదల రజిని… ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్ లో చర్చిస్తామన్నారని.. అలాగే ప్రధాని నరరేంద్ర మోడీకి సైతం దీనిని చూపేందుకు ఏపీకి తీసుకొస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..
Read Also: Addanki Dayakar: వీడిన కోమటిరెడ్డి మిస్టరీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు.. వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నారు.. ఇప్పటికే భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి. ఒక్కో విలేజ్ క్లినిక్‌లో అవుట్ పేషెంట్ రూమ్, ఎగ్జామినేషన్ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.. ప్రతీ 2,500 జనాభాకు ఒక విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇక, దీని కోసం డిసెంబర్‌లోగా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 7,112 మంది మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనుంది ప్రభుత్వం.. ఇప్పటికే 2,920 క్లినిక్‌లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచబోతున్నారు..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!