Ancient Ayyappa Idol: ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చిన అయ్యప్ప విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రం ఎంతో సంపదను మనకు అందిస్తుంది. ఉప్పాడ తీర వాసులకు అయ్యప్ప స్వామి విగ్రహ దర్శనం లభించింది. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది పురాతన అయ్యప్ప విగ్రహం. కెరటాలతో పాటు వచ్చినట్లు గుర్తించి బయటకు తీశారు స్థానిక యువకులు. స్థానిక జగన్నాథస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు అయ్యప్ప భక్తులు, మహిళలు. వివిధ కారణాల వల్ల సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆలయాల నుంచి ఈ విగ్రహం కొట్టుకుని వచ్చినట్లు భావిస్తున్నారు స్థానిక యువకులు.

Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
అయ్యప్ప దీక్షల సమయం కావడంతో ఈ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. చేపల కోసం వల వేస్తే అయ్యప్ప విగ్రహం వలకు తగిలింది. బరువుగా ఉండడంతో గట్టిగా లాగి ఆ విగ్రహాన్ని బయటకు తీశామని స్థానికులు తెలిపారు. ముగ్గురు మోసుకుని వచ్చి జగన్నాథ స్వామి గుడిలో పెట్టి పూజలు చేస్తున్నామన్నారు. దీనికి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం లభించడం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని, శుభసూచకం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విగ్రహం ఇతర దేశాలకు చెందినదా, లేక మన దేశంలోని ఆలయానికి చెందినదా అనేది ఇంకా తేల్చాల్చి వుంది.

Read Also: Superstar Krishna: ఆయనే మన జేమ్స్‌బాండ్.. కృష్ణ మృతిపై తెలుగు సీఎంల సంతాపం
గతంలో సముద్ర తీరంలోకి ఒక ఆలయం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అసాని తుపాను వచ్చినప్పుడు ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావించారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు పేర్కొన్నారు.
ఆ రథం మయన్మార్ దేశానిదని తర్వాత ప్రకటించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రథంపై ఉన్న భాషను గూగుల్‌లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్‌దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదన్నారు పోలీసులు. మరి ఇప్పుడు కొట్టుకుని వచ్చిన అయ్యప్ప విగ్రహం ఎక్కడిది అనేది త్వరలో తేలనుంది.

శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన గోల్డెన్ టెంపుల్ ఇదే
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?