విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా.. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.. తన వైజాగ్ పర్యటనపై ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్.. మీడియాతో ఏం మాట్లాడుతున్నారో లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
ఉత్తరాంధ్ర గర్జన నేపథ్యంలో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో అరెస్ట్అయినవారిని స్టేషన్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 13 మంది మినహా మిగతా అందిరికీ స్టేషన్ బెయిల్ వచ్చిందన్నారు.. ఇక, తన విశాఖ పర్యటనలో ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని.. ఇలాంటి ఆంక్షలు మళ్లీ విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా పోరాటం చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప.. పోలీసులపై…
Vallabhaneni Vamsi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకుని ఈదాలనుకుంటున్నారని.. పవన్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న…
CM Jagan: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు,…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా విశాఖ పర్యటనలోనే ఉన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా నోవాటెల్ హోటల్లో పవన్ ఉండిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పార్టీ నేతలతో పలు మార్లు కీలకంగా మాట్లాడిన అనంతరం ఆయన సోమవారం మధ్యాహ్నం విశాఖ నుంచి విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన ప్రయాణించే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. హోటల్ వద్ద గుమికూడిన…
Kishan Reddy: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు దూకుడు ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకిచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కక్షసాధింపు…
రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 సర్వీసుల ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,019 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 150 నిమిషాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు సెక్యూరిటీని పెంచుతూ ఏపీ ప్రభుత్వం భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు అదనంగా నలుగురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజును హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు నలుగురు పోలీసులను కేటాయిస్తు రాష్ట్ర పోలీసు శాఖ భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. Read Also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని…
Missing Case: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 7వ తరగతి విద్యార్థిని అదృశ్యం అయ్యింది. మూడు రోజులు గడచినా విద్యార్థిని ఆచూకీ తెలికపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బద్వేల్ మండలం ఉప్పత్తివారిపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లె చిన్న వెంకట సుబ్బారెడ్డి రవణమ్మ కుమార్తె వెంకట సంజన బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూలులో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి బయటకు వచ్చిన వెంకట సంజన తిరిగి స్కూల్‌కు వెళ్ళక పోవడంతో…