పండుగ సమయంలో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు..
తమ అభిమాన నేత పుట్టిన రోజును వైయస్ఆర్సీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున కేక్‌లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సైతం.. ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమన్న ఆయన.. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.. అయితే, నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు.. అయితే, వారి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.. పలు డిమాండ్లపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది..