బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు
చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం వైఎస్ జగన్‌ను పీకేదేం ఉండదన్నారు కొడాలి నాని . చంద్రబాబు అవుట్‌డేటెడ్ పొలిటీషియన్ అని సీఎం జగన్, మేం రోజు చెబుతూనే ఉన్నాం.. ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా..? అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ను మేం పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యానించారు.
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలి కలిశాడు మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు.. తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. మీ కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు ఆ రైతు.. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్.. వెటకారంగా మాట్లాడుతూ.. సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.
ఎంతమంది చంద్రబాబు కలిసి వచ్చినా.. వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేరు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇక, గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి విడుదల రజిని.. ఎవరు ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.
సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు.
ఆంప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల రెండు రోజుల పర్యటన ముగిసింది.. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించిన సీఈసీ ప్రతినిధులు.. శనివారం సాయంత్రం తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు.. అయితే, ఈ పర్యటనలో.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా…