ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారు.. చంద్రబాబుకి పూర్తిగా మతిభ్రమించింది.. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు సోము వీర్రాజు
ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యాడు.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.. లోక్‌సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరా.. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. పనిలోపనిగా తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు. అయితే, మరోసారి బెజవాడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు నాని.. అవసరం అయితే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతాననే…
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. వైసీపీ బైబై చెప్పడం ఖాయమనిపిస్తోంది.. పార్టీ మార్పుపై ఈ రోజు స్పష్టత ఇవ్వనున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గంలో కాపు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అక్కడే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు..
మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది..