ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్‌నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. వాస్తవంలో…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో కొనసాగుతూనే ఉంది.. కేంద్రం గెజిట్లు విడుదల చేసినా.. మంత్రులు, నేతల మధ్య హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జల జగడం విషయంలో స్పందిస్తూ.. ఎన్నికల కోసమో, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కోసమో.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం తెలంగాణకి మంచి పద్దతికాదని హితవుపలికారు.. ఏపీకి రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క తగ్గినా ఒప్పుకోమని స్పష్టం చేసిన ఆయన..…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరి ఫిర్యాదుల వరకు వెళ్లింది.. జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేస్తే.. ఆర్డీఎస్ విషయంలో ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది.. అయితే ఇవాళ రెండు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు లేఖలు రాసింది.. ఇప్పటికే తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు లేఖ రాసిన కేఆర్ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో..…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్‌ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల…
కృష్ణా జలాల విషయం ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… ఇక, నీటి వివాదంపై ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. ఏపీతోనే కాదు.. దేవుడితో కొట్లాడతాం.. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటాం అన్నారు.. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని ప్రకటించారు..…
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్‌లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ,…
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన..…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం హీట్ పెంచుతోంది.. తెలంగాణ మంత్రుల కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జలవివాదంపై చర్చ జరిగింది… చుక్కునీరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని కేబినెట్ ప్రకటించింది. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ వ్యవహర శైలి కొంత కాలంగా చూస్తున్నాం.. ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం…