Sky Walk In Vizag: విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం అయింది. నేటి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభవం పరిచయం కానుంది. భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంగా గ్లాస్ బ్రిడ్జ్ కు గుర్తింపు రానుంది.
విశాఖ ఆర్కే బీచ్ (రామకృష్ణ బీచ్) సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ అలలతో ఎగిసిపడే సముద్రం బాగా వెనక్కి వెళ్లింది. దీంతో నీలి సముద్రంపు కెరటాల మధ్య చిక్కుకుపోయిన శిలలు బయటపడ్డాయి. బ్రిటీష్ కాలం నాటిదిగా భావించే బంకర్ సైతం వెలుగులోకి వచ్చింది. అలలు తగ్గడంతో భారీ రాళ్లు ఎక్కి సందర్శకులు సందడి చేశారు. సెల్ఫీలు, రీల్స్ చేస్తూ హడావిడిగా కనిపించారు. Also Read: Pawan Kalyan: 75 ఏళ్ల తర్వాత విద్యుత్ కనెక్షన్.. పవన్…
Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవావయా, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక…
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా బడ్జెట్, విధానాలు, ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST), ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న టూరిజం కాన్‌క్లేవ్ టెక్ AI 2.0 రెండవ రోజు సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కీలక అభిప్రాయాలను తెలిపాడు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక విధానాల అమలులో గణనీయ పురోగతి సాధించేందుకు మౌలిక…