Sky Walk In Vizag: విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం అయింది. నేటి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభవం పరిచయం కానుంది. భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంగా గ్లాస్ బ్రిడ్జ్ కు గుర్తింపు రానుంది. 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ పొడవు 55 మీటర్లు ఉంది. ఇది, సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన మీద నుంచి సముద్ర అందాలు, తూర్పు కనుమలు, వైజాగ్ నగరాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇంపోర్టెడ్ జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ స్కై వాక్‌వే పై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.