వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…