Andhra Pradesh GST: ఏపీలో సెప్టెంబర్ మాసంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. నికర జీఎస్టీ వసూళ్లలో 7.45 శాతం వృద్ధి సాధించింది. ఈ సెప్టెంబర్‌లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,789 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ శకం ఆరంభమయ్యాక ఆంధ్రప్రదేశ్ రెండోసారి అతి పెద్ద స్థూల రాబడి నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లలోనూ 4.19 శాతం వృద్ధి సాధించింది. ఈ సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు…