ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట..
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విజయసాయిరెడ్డిపై, అలాగే రాష్ట్రంలోని లిక్కర్ స్కాంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ మాఫియా, డిస్టిలరీ ఆర్డర్లు, లిక్కర్ అమ్మకాలపై చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను తెలిపారు. జగన్ మాట్లాడుతూ.. ఏ లిక్కర్ కంపెనీ డిస్టలరీ మేలు చేయాలో ప్రైవేట్ షాపుల పేరుతో వీళ్ళ ప్రైవేట్ సైన్యం ఇండెంట్ ప్లేస్ చేస్తారన్నారు. మా హయాంలో ఎప్పుడైనా ఇలా చూసారా? గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అదనంగా…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అవినీతి, అమరావతిలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా వంటి అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తమ హయాంలో వర్షాకాలం కోసం 80 వేల టన్నుల ఇసుక నిల్వ చేసినప్పటికీ, టీడీపీ…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా పరిస్థితులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగన్ కౌంటర్లు హాట్ టాపిక్ గా మారాయి. అభివృద్ధి మంత్రం తన చేతిలో ఉందని ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన హామీలను గుర్తు చేసారు. మరింత సంక్షేమం చేస్తామని చెప్పారు. కానీ, 12 నెలలు పూర్తయ్యినా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు…