EX Minister Sailajanath: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్ ఉండనుంది కానీ పేర్లు మాత్రం పూర్తిగా మార్చేశారు. ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి…
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వార్ మరోసారి తెరమీదకు వచ్చింది. అది కూడా హిందీ భాష మీదనే. గతంలోనూ హిందీ భాష విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాతృభాష అమ్మలాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ నేర్చుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదని.. మరింత…
సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు,
మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్‌ను సీఎం కొనియాడారు.
సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా…
Yuvatha Poru: శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా పరిషత్ వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘యువత పోరు’ కార్యక్రమానికి యువత భారీగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యవతకు మోసం చేస్తోందని, కూటమి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ…
కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు.
ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు..
Buggana Rajendranath: ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన నేడు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్బంగా బుగ్గన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా ఉపేక్షించరనీ ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది.. అది ప్రజలైన కూడా ఆయన ఉపేక్షించరని విమర్శించారు. ప్రజలు ఎన్నికల…