Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రచ్చ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన EOIలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు బ్లాక్ డ్రెస్‌ల్లో కౌన్సిల్ మీటింగ్ కు హాజరై నినాదాలు చేశారు.
Read Also: Supreme Court: జంతు ప్రేమికులకు ఊరట.. వీధి కుక్కల తీర్పుపై కీలక పరిణామం
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని జీవీఎంసీ కార్యాలయం ముందు వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులతో నిరసన తెలిపారు.