Off The Record: కోనేటి ఆదిమూలం…. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే. ఈ ఎస్సీ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా రాజకీయం చేస్తున్న నాయకుడు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, తిరిగి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు. ఒకప్పుడు టిడిపి నుంచి జడ్పీటీసీగా గెలిచి….. ఆ తర్వాత టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి అట్నుంచి వైసీపీకి వెళ్ళారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి… తిరిగి 2019లో అక్కడే ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక 2024 ఎన్నికలకు ముందు మాజీ…
Off The Record: హై వోల్టేజ్ పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన మార్క్ కనిపిస్తోందా అంటే… అనుమానపు చూపులే అందరి సమాధానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకే ప్రస్తుతం డౌట్స్ ఎక్కువగా ఉన్నాయట. పైగా… తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు మావాళ్ళు అపరిపక్వంగా వ్యవహరించి పరువు తీశారని పార్టీ సీనియర్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయాక…
YS Jagan Pulivendula tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటామని చెబుతూ పూర్తి చేశారు.. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీ నేతలకు సంబంధించిన వివాహ వేడుకలకు హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.. మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుని…
Off The Record: తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి సమస్యగా ఉన్న నియోజకవర్గాల్లో శింగనమల ప్రధానమైనది. ఇప్పుడే కాదు…. గత ఏడేళ్ళుగా ఇక్కడ ఏకాభిప్రాయం లేదు.. కార్యకర్తలు సంతృప్తిగా లేరు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే గొడవగా మారింది. అందుకు ప్రధాన కారణం 2019 ఎన్నికలకు ముందు బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడమేనన్నది లోకల్ కేడర్ చెప్పే మాట. శ్రావణి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు కొందరు. ఈ గొడవల క్రమంలో… 2024 ఎన్నికలకు ముందు కూడా…
Minister Anagani: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతల మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కొందరు చరిత్ర హీనులు ఉంటారు.. వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజర్చుకోలేను అని సెటైర్ వేశారు.
విజయనగరం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుకోలేదని.. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తోందన్నారు..