Kurnool Boy Attempts Suicide After Alleged Harassment By Cops: పోలీసుల్లో చాలామంది న్యాయబద్ధంగా పని చేస్తూ, ప్రజలకు రక్షణ కల్పిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం తమ ఖాకీ దుస్తుల్ని చూసుకొని రాక్షసత్వం ప్రదర్శిస్తుంటారు. తాము ఏం చేసినా చెల్లుతుందని అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ముఖ్యంగా.. అమాయకుల్ని టార్గెట్ చేసుకొని, వారిని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఏ తప్పు చేయకపోయినా సరే, పోలీస్ దుస్తుల వెనకున్న పైశాచికాన్ని చూపిస్తుంటారు. ఇలాంటి పోలీసుల పైశాచికం వల్ల ఎంతోమంది అమాయకులు బలి అయిపోయారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన తప్పేమీ లేకపోయినా.. నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో, అతడు భరించలేక పురుగుల మందు తాగేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
iPhone 13 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 21 వేలకే ఐఫోన్ 13! డోంట్ మిస్ ది ఛాన్స్
కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపాపురంలో రఫీక్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల రఫీక్ స్నేహితుడు ఒకడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఎత్తుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. నెల రోజుల క్రితం ఈ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. వీరికి రఫీక్ సహకరించి ఉంటాడని, అతడ్ని పట్టుకుని నిలదీస్తే మొత్తం వివరాలు బయటకు చెప్తాడని వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో.. పోలీసులు రఫీక్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు నిజంగానే తెలిదయని ఎంత చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు అతడ్ని చితకబాదారు. అసలు వాళ్లు వెళ్లిన సంగతి తనకు తెలియదని, తన స్నేహితుడు ఏం చెప్పలేదని ఎంత మొత్తుకున్నా.. పోలీసులు వినిపించుకోలేదు. తమ ఖాకీ దుస్తుల్ని చూసి రెచ్చిపోయి, ఆ అమాయకుడిపై రాక్షసుడిలా ఎగబడ్డారు. చెప్తావా? చస్తావా? అంటూ వేధింపులు పెట్టడం మొదలుపెట్టాడు.
Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
చివరికి వారి వేధింపులు తాళలేక, ఈ కేసు నుంచి తనని తప్పించాలని కోరుతూ రఫీక్ ఏఎస్ఐకి రూ.30 వేలు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తర్వాత రఫీక్‌ని విడిచిపెట్టారు. కానీ.. ఆ రూ.30 వేలతో పోలీసుల ఆకలి తీరలేదు. పారిపోయిన ఆ జంటని పట్టుకోవడం చేతకాక.. రఫీక్ నుంచి మరింత డబ్బు వసూలు చేయాలన్న పైశాచికంతో అతడ్ని మరింత వేధించడం మొదలుపెట్టారు. తాను బతికున్నంతకాలం పోలీసులు ఇలాగే తనని వేధిస్తారని అనుకున్న రఫీక్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే రఫీక్‌ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వేధింపుల వల్లే తమ తనయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. ఆ ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.