Rain Alert : తెలంగాణలో వాతావరణ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు…