గోదావరి వరద భయపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాత రికార్డులు బద్దలు కొట్టి మరీ దూసుకొస్తున్న వరద.. మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 1986 లో మేడిగడ్డ ప్రాంతంలో రికార్డు అయిన భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం,…