Gudivada Amarnath: చంద్రబాబు నటన, నాట్యం చూస్తే.. జయప్రద సిగ్గు పడేలా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Reddy Counter To Chandrababu Naidu: ప్రకృతి వైపరీత్యాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నటనలో తన మామ ఎన్టీఆర్‌నే చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నటన, నాట్యం చూస్తూ.. జయప్రద కూడా సిగ్గు పడేలా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష కుటుంబాలకు వరద సహాయం అందించామని.. కానీ చంద్రబాబు వరద ప్రాంతాలకు వెళ్లి అబద్ధాలు చెప్తున్నారన్నారు.
వరద నష్టం అంచనా అయ్యాక ఇచ్చే నష్ట పరిహారాన్ని.. తక్షణ సహాయం కింద తాను గతంలో ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పిన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని అమర్నాథ్ అన్నారు. హుదూద్‌ని కూడా ఆయన తన ప్రచారానికి వాడుకున్నారే తప్ప, బాధితుల్ని ఆదుకుందేమీ లేదని ఆరోపించారు. చంద్రబాబు హామీలు పేపర్లలో తప్ప.. చేతల్లో చూపించడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఇక ఇదే సమయంలో.. విలీన మండలాలతో ప్రత్యేక జిల్లాను చేసే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
Also Read
- YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
- Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
- CM Chandrababu : 'అర్నాబ్' తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
కాగా.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు, వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏపీని పాలిస్తోందని, వరదల కారణంగా భారీ నష్టాలొస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. ప్రజల కోసం కష్టమైనా పలకరించాలన్న బాధ్యతతో తాను ప్రజల్లోకి వచ్చానని, కానీ సీఎం మాత్రం ప్యాలెస్‌లో దర్జాగా కూర్చున్నారంటూ ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే గుడివాడ అమర్నాథ్ పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
-
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ కార్లు.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం!
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?