Andhra Pradesh Election 2024: ఏపీలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగగా సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా 78.25…