Perni Nani: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ పెరిగిందని రెండు గంటల పాటు చెప్పి, మిగతా సమయం మొత్తం జగన్ ప్రభుత్వాన్నే తప్పుపట్టడమే చంద్రబాబు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు…
Former Jammalamadugu MLA Sudheer Reddy was arrested : జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన ఓ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో అరెస్టు చేసినట్టు సమాచారం.
బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు.