ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), కార్యదర్శిగా సానా సతీష్‌తో సహా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మూడేళ్ల కాలపరిమితితో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది నూతన కమిటీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడే ఒక ట్వంటీ20 (T20) ఫ్రాంచైజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL). ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఈ లీగ్ ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక జాతీయ వేదికగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా వారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లేదా జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశం పొందవచ్చు. అయితే ఆసక్తికరంగా విజయవాడ సన్ షైనర్స్ అనే జట్టుని…
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.
Kesineni Chinni: ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
డిసెంబర్‌లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్‌లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు.
ఏపీలో త్వరలో మరో క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోగో, టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం నివాసంలో సీఎం జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 6 నుంచి జూలై 17 వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది.…
మరికొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సమరం ముగియనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు ఏ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మరో క్రికెట్ సమరం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం పలికింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగనుంది. ఈ విషయాన్ని ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ సభ్యులు ప్రకటించారు. Hockey: ఆసియా…