ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమ్మె అన్ని విభాగాలను తాకుతోంది.. ఓవైపు ప్రభుత్వం చర్చలు అంటుంటే.. మరోవైపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, పాత పే స్కేల్‌ను ఉద్యోగులు కోరుతుంటే.. కొత్త పే స్కేల్ ప్రకారమే చెల్లింపులు చేస్తామంటోంది ప్రభుత్వం.. అయితే, వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ఆర్ధిక శాఖ.. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకు తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అంకౌంట్స్ అధికారులను ఆదేశించింది.. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్..
Read Also: వెనక్కి తగ్గిన ఎస్బీఐ.. ఇక మునుపటి నిబంధనలే..