Anchor Shyamala Reacts on AP Election Results: 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలను విమర్శించిన యాంకర్ శ్యామల అనూహ్యంగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శ్యామలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. ఎన్నికల్లో ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను కచ్చితంగా…
Anchor Shyamala Sensational Comments on Pawan Kalyan: మరికొన్ని గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మీదే తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, వైయస్ జగన్, చంద్రబాబు, లోకేష్ వంటి వాళ్లు పోటీ చేసిన స్థానాల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.…
Anchor Shyamala Clarity on Bangalore Rave Party: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయితే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం…
Getup Srinu Comments on Anchor Shyamala: ఆంధ్ర ప్రదేశ్ సహా భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత వేడెక్కింది అని చెప్పొచ్చు. అయితే ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి మహాకూటమిగా బరిలో దిగితే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆసక్తికరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జబర్దస్త్…
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. స్వచ్చందంగా వైస్సార్‌సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో యాంకర్ శ్యామల ఈ రోజు 51వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేశినేత శ్వేత తెలిపారు.
తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… సమాజంలో మార్పు…