Getup Srinu: ఆ విషయంలో యాంకర్ శ్యామల సమాధానమే నా సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Getup Srinu Comments on Anchor Shyamala: ఆంధ్ర ప్రదేశ్ సహా భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత వేడెక్కింది అని చెప్పొచ్చు. అయితే ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి మహాకూటమిగా బరిలో దిగితే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆసక్తికరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జబర్దస్త్ నటీనటులు చాలామంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఇక తాజాగా ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఆయనని ఒక మీడియా ప్రతినిధి ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు.
Getup Srinu: చిన్న ప్రాణాలన్న ఆర్కే రోజా.. గెటప్ శ్రీను షాకింగ్ రిప్లై
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
అదేమిటంటే మీరు ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నారంటే మరో పార్టీ ని ఓడించాలని కోరుతున్నట్టే కదా. అలా ప్రచారం చేస్తున్న మీకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఏమిటి పరిస్థితి అని ప్రశ్నించారు. దీనికి గెటప్ శ్రీను చాలా తెలివిగా స్పందించాడు. ఈ విషయం మీద ఇటీవలే యాంకర్ శ్యామల ఒక సమాధానం ఇచ్చారని తన సమాధానం కూడా అదేనని చెప్పుకొచ్చారు. అయితే సదరు మీడియా ప్రతినిధి కూడా తాను యాంకర్ శ్యామల ఏం చెప్పారో వినలేదని మీరేం చెప్పాలో అదే చెప్పమని కోరారు. దీంతో సినీ పరిశ్రమలో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరని, అంత కుసంస్కారం ఉన్నవాళ్లు సినీ పరిశ్రమలో ఉంటారని తాను అనుకోవడంలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఎలా అయితే ఒక ఊరిలో రకరకాల పార్టీలకు మద్దతు ఇచ్చేవాళ్ళు కలిసిమెలిసి జీవిస్తారో సినీ పరిశ్రమ కూడా అలాంటిదేనని ఇక్కడ ఇబ్బంది పెట్టుకునే విషయాలేవీ ఉండవని ఆయన కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!