‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ సినిమా ‘స్పిరిట్’ కోసం ఆయన రెడీ అవుతున్నప్పటికీ, సమాంతరంగా నిర్మాతగా కూడా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు వేణు తెరపైకి…