ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు. అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..! ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు…